పైకి చాలా అందంగా, హుందాగా కనిపించే చిత్ర పరిశ్రమలో తెర వెనుక అనేక యవ్వారాలు జరుగుతాయి. మోసాలు, ప్రేమలు, విడిపోవడాలు, అక్రమ సక్రమ సంబంధాలు అనేకం అయితే చోటు చేసుకుంటాయి.

పలు సవాళ్లతో కూడిన చిత్ర పరిశ్రమలో ఇవన్నీ సాధారణం. వాటిని తట్టుకుని నిలబడ్డ వాళ్లే పరిశ్రమలో ఉంటారు. కన్నడ పరిశ్రమకు చెందిన అర్చన అనంత గురించి దారుణమైన పుకార్లు వినిపిస్తున్నాయి. ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ కన్నడ మీడియాలో సంచలన కథనాలు కూడా వెలువడుతున్నాయి.


అర్చన అనంత అంటే వెంటనే మనకు స్ట్రైక్ కాకపోవచ్చు. అయితే కార్తీక దీపం సౌందర్య అంటే టక్కున గుర్తుకు వస్తారు. బుల్లితెర ప్రేక్షకులకు అర్చన పరిచయం అక్కర్లేని ఫేస్. సీరియల్స్ లో రారాజుగా వెలుగుతున్న కార్తీకదీపం సౌందర్యగా పిచ్చ ఫేమస్. వంటలక్క అత్తగా అర్చనకు మంచి గా పేరొచ్చింది. కార్తీక దీపం సీరియల్ భారీ సక్సెస్ సాధించడంతో అర్చనకు బుల్లితెరతో పాటు వెండితెర ఆఫర్స్ కూడా తలుపు తడుతున్నాయట.

కేరాఫ్ అనసూయ టైటిల్ తో ప్రసారం అవుతున్న సీరియల్ లో అర్చన పొగరుబోతు అత్తగా నటిస్తున్నారు. అల్లుడు అంటే మండి పడే ఊరి పెద్దగా ఆమె నటన మెప్పిస్తుంది. ఈ మధ్య తెలుగు సినిమాలలో కూడా ఆమె కనిపించి సందడి చేస్తున్నారు. అర్చన తనకంటూ తెలుగులో ఒక ఇమేజ్, గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా మంచి పేరు సంపాదించిన అర్చన వ్యక్తిగత జీవితంపై ఆరోపణలు అయితే తలెత్తుతున్నాయి.

 

పెళ్ళై పిల్లలు ఉన్న అర్చన కన్నడ పరిశ్రమలో అఫైర్స్ నడుపుతున్నారట. డబ్బుల కోసం చేయకూడని పనులు చేస్తున్నారట. ఫేమ్ తో పాటు చేతి నిండా ఆఫర్స్ ఉన్న అర్చన ఇలాంటి పనులకు పాల్పడడం ఏమిటని అభిమానులు కూడా ఆవేదన చెందుతున్నారట. కన్నడ మీడియాలో అర్చన పర్సనల్ లైఫ్ గురించి వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రచారమవుతున్న వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ కథనాలపై అర్చన ఇంకా స్పందించలేదు.ఆమె నోరు విప్పితే ఏదైనా క్లారిటీ అయితే రావచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: