ప్రగతి  ఈ పేరుకి పరిచయాలు అవసరం లేదు..ఈమె  హీరోయిన్గా అవుదామని సినీ ఇండస్ట్రీకి వచ్చి.. ఆ తర్వాత కొన్ని సినిమాలు హీరోయిన్గా చేసి .. ఫైనల్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది .ప్రగతి టోటల్ సినీ ఇండస్ట్రీ చరిత్ర. సినిమా ఇండస్ట్రీలో హీరోకు హీరోయిన్ లకి కి తల్లిగా బోలెడన్ని సినిమాల్లో నటించి.. మెప్పించి.. అలరించిన ప్రగతి.. గురించి ఎంత చెప్పినా తక్కువే .అయితే  చూడటానికి చాలా యంగ్ లుక్ లో కనిపించే ప్రగతిని మన దర్శక నిర్మాతలు చిన్నవయసులోనే అమ్మని చేసేసారు.ఇక అమ్మలాంటి రోల్స్ ఇస్తూ హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిన ఈమె ఆశలపై నీళ్లు చల్లారు . 

 రీసెంట్గా ప్రముఖ పత్రిక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి సంచలన విషయాలు బయటపెట్టింది . అయితే ఈ క్రమంలోనే తనను తాను ఎందుకు హీరోయిన్గా ఎదగలేకపోయాను అన్నదానికి క్లారిటీ ఇచ్చింది . :ఓ సినిమా షూటింగ్లో భాగంగా రెయిన్ డ్యాన్స్ లో ఓ డ్రస్ వేసుకోమన్నారు..ఇక  అది నాకు ఇబ్బందికరంగా అనిపించింది ..నేను వేసుకోనంటే వేసుకోను అని ముఖానే చెప్పేశాను. ఇక దీంతో ఆ సినిమా నుంచి నన్ను తీసేశారు.కాగా ఆ రోజు చాలా బాధపడ్డాను."అంతేకాదు మరీ ముఖ్యంగా తల్లి పాత్రలు చేసే టైంలో నాకు చంద్రమోహన్ గారి భార్య గా ఆఫర్ వచ్చింది.

ఇక నాకు బాగా ఏడుపొచ్చింది. అయితే నేను చంద్రమోహన్ గారి భార్యని ఆంటీ అని పిలుస్తాను . ఇక అలాంటి ఆయన పక్కన నన్ను అలా మాట్లాడేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి  షూటింగ్ కి నేను అందంగా జడలు వేసుకుని రెడీ అయి వెళ్లితే..నవ్వుకునే వారు.. వెంటనే జడ ముడి వేయించారు.కాగా  గ్లామర్ డ్రెస్ వేసుకున్న ఏంటి అమ్మ రోల్స్ చేసే ఆమె ఇలాంటివి వేసుకుందని ఫేస్ మీదనే అరిచే వాళ్ళు.. అప్పుడు నేను చాలా బాధపడ్డాను . ఇక సినీ ఇండస్ట్రీ అంటే మాయలోకం అని అప్పుడే నాకు అర్థమైంది . అయితే ప్రజెంట్ నాకు నచ్చినట్లు నేను జీవిస్తున్నాను"..అంటూ చెప్పుకొచ్చింది.ఇకపోతే మనకు తెలియని విషయం ఏమిటంటే దాదాపు ఏడు చిత్రాల వరకు ప్రగతి హీరోయిన్గా నటించింది.అయితే  ఏది ఏమైనా సరే సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో గెస్ చేయలేమనడానికి ప్రగతి మరో ఎగ్జాంపుల్ గా నిలిచింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: