తమిళ స్టార్ హీరో కార్తి ఈ యేడాది మణిరత్నం దర్శకత్వంలో చేసిన 'పొన్నియన్ సెల్వన్' సినిమా సక్సెస్‌తో పూర్తి దూకుడు మీదున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తూ 'సర్ధార్' మూవీతో పలకరించారు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి విజయం అందుకుంది. ఈ చిత్రంలో కార్తి తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేసారు. ఇందులో చంద్రబోస్ (సర్ధార్) పాత్రలో కనిపించారు. ముఖ్యంగా. ఎక్స్ రా ఆఫీసర్ పాత్రలో కార్తి నటన పీక్స్‌లో ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే బంగ్లాదేశ్ చిట్టగాంగ్ జైలు ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 'సర్ధార్' మూవీలో రెండోది సర్ధార్ కొడుకు ఇన్‌స్పెక్టర్ విజయ ప్రకాష్ పాత్రలో మంచి ఈజ్‌తో నటించారు. ఈ సినిమాలో కార్తి సరసన రాశీ ఖన్నా..రజిషా విజయన్ హీరోయిన్ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం దీపావళి విజేతగా నిలిచింది.


సర్ధార్ తెలుగు మూవీ ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ చిత్రం తొలి రోజు తెలుగులో రూ. 0.95 కోట్ల షేర్ రాబట్టింది. 2వ రోజు రూ. 1.05 కోట్ల షేర్ వసూళు చేసింది. 3వ రోజు రూ. 1.48 కోట్లు.. 4వ రోజు రూ. 1.32 కోట్లు.. 5వ రోజు రూ. 0.64 కోట్లు.. 6వ రోజు రూ. 0.44 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 5.88 కోట్లు షేర్ (రూ. 9.75 కోట్లు గ్రాస్) వసూళ్లు చేసింది.


మొత్తంగా ఏరియా వైజ్ 6 రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం) రూ. 2.53 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) రూ. 0.756 కోట్లు.. మిగిలిన ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 5.50 కోట్లు రాబట్టింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.88 కోట్లు షేర్ (రూ. 9.75 కోట్ల గ్రాస్ )వసూళ్లను రాబట్టింది.తెలుగులో 'సర్ధార్' మూవీని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నాగార్జన రిలీజ్ చేసారు. తెలుగులో ఈ చిత్రం రూ. 5.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. తాజాగా ఈ సినిమా నిన్నటితో రూ. 5.88 కోట్లు రాబట్టి లాభాల్లోకి వచ్చింది. మొత్తంగా 0.38 లక్షలు లాభాలతో హిట్ అనిపించుకుంది.


 ఈ యేడాది తెలుగులో 15వ క్లీన్ హిట్ అనిపించుకున్న చిత్రంగా నిలిచింది. మొత్తంగా తెలుగులో కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణ, కాంతారాతో పాటు విక్రమ్, డాన్ సినిమాల తర్వాత తెలుగులో డబ్బైన చిత్రాల్లో హిట్‌ అనిపించుకున్న చిత్రంగా కార్తి సర్ధార్ నిలిచింది.ఓవర్ సీస్ వసూళ్లలో కూడా హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఒక పక్క ఎన్నో అంచనాలతో వచ్చిన శివ కార్తికేయన్ సినిమా నిరాశపరచగా సైలెంట్ కార్తీ సర్ధార్ తో వచ్చి హిట్ కొట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: