గతంలో నందమూరి తారకరామారావు వెండి తెర పై శ్రీరాముడు శ్రీకృష్ణుడు గా కనిపిస్తే జనం ధియేటర్లలో పువ్వులు జల్లి హారతులు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేక్షకుల అభిరుచి మారిపోవడంతో హీరోలను దేవుడి పాత్రలలో నటిస్తే అంగీకరించే పరిస్థితి ఇక ఉండదా అన్న సందేహాలు ఇప్పుడు చాలామందికి కలుగుతున్నాయి. ఇలాంటి సందేహాలు రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.


ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపిస్తున్నాడని తెలిసి చాల అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఈమూవీకి సంబంధించిన టీజర్ లో ప్రభాస్ లుక్ ను చూసి చాలామంది పెదవి విరుస్తున్నారు. ఇక లేటెస్ట్ గా దీపావళి రేస్ కు వచ్చిన రెండు సినిమాలు దేవుడు చుట్టూ తిరుగుతాయి. విశ్వక్ సేన్ వెంకటేష్ లు కలిసి నటించిన ‘ఓరి దేవుడ’ మూవీలో వెంకటేష్ మనిషి రూపంలో ఉన్న దేవుడిగా కనిపిస్తూ విశ్వక్ సేన్ కు జీవితంలో సెటిల్ అవ్వడానికి సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఈసినిమా ఒక తమిళ సినిమాకి రీమేక్.


తమిళంలో హిట్ అయిన ఈమూవీ తెలుగులో ఫ్లాప్ అయింది. ఇక ఈ దీపావళికి వచ్చిన బాలీవుడ్ మూవీ థాంక్ గాడ్’ మూవీ కథ కూడ దేవుడు చుట్టూ తిరుగుతుంది. జీవితంలో చాల సాధించాలని ఆరాటపడే హీరో సిద్ధార్థ మల్హోత్రా పాత్ర ఒక యాక్సిడెంట్ లో చనిపోయి దేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు అతడికి బతకడానికి మరొక  సెకండ్ ఛాన్స్ ఇస్తాడు. ఈసినిమా కూడ ఫ్లాప్ అయింది.


గతంలో పవన్ కళ్యాణ్ వెంకటేష్ లు కలిసి నటించిన ‘గోపాల గోపాల’ మూవీ కూడ ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. ఇందులో పవన్ దేవుడి గా కనిపిస్తే అతడి అభిమానులు కూడా పెద్దగా ఆదరించలేదు. జనం ఆమధ్య వచ్చిన నాగార్జున నటించిన ‘నమో వెంకటేశాయ’ సినిమాను కూడ తిప్పి కొట్టారు. ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే నేటితరం ప్రేక్షకులు హీరోలను దేవుళ్ళుగా గుర్తించ లేకపోతున్నారా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: