ఏదైనా ఒక సినిమా ఒక కాన్సెప్ట్ లో వచ్చి అది హిట్ అయింది అంటే.. తర్వాత రెండు మూడు సినిమాలు కూడా అదే కాన్సెప్ట్ లో వస్తాయి.. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఆ కాన్సెప్ట్ మీదే సినిమాలు తీయడానికి ప్రయత్నాలు చేస్తారు.

ఇప్పుడు ఇదే పరిస్థితి టాలీవుడ్ లో కనిపిస్తుంది. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ సినిమాలతో వరుస సినిమాలు చేసిన టాలీవుడ్ దర్శకులు హీరోలు తర్వాత బాలీవుడ్ నుండి హీరోయిన్లను తీసుకువచ్చి సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందని అ పద్ధతి నే ఫాలో అయ్యారు. ఇక ఇప్పుడు ప్రతి సినిమాలో దేవుడికి సంబంధించిన ఏదో ఒక విషయం ఉండేలాగా చూసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం రీసెంట్ గా దేవుడు ఫార్మాట్లో వచ్చిన సినిమాలన్నీ టాలీవుడ్ లో సూపర్ హిట్ కూడా అయ్యాయి.

 

ముందుగా ఈ ఫార్మాట్లో బాలకృష్ణ అఖండ సినిమాతో వచ్చి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. తర్వాత హీరో నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా వైడ్‌ గా సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు కన్నడ చిత్రమైన కాంతారా పాన్ ఇండియా వైడ్‌ గా సెన్సేషన్ హిట్ గా దూసుకుపోతుంది. ఈ మూడు సినిమాలలో ప్రధానంగా ఒకే ఫార్మాట్లో వచ్చాయి.. ఆ ఫార్మట్‌ ఏమిటంటే ఈ మూడు సినిమాలో కథ మొత్తం దైవత్వం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మూడు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయని తెలుస్తుంది.

 

ఇప్పుడు టాలీవుడ్ దర్శకులు అందరూ వారు చేయబోయే సినిమాలలో కథ దేవుడు చుట్టూ తిరిగే విధంగా రాస్తున్నారటా.. హీరోలు కూడా అదే ఫార్మాట్లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ దర్శకులు కూడా ఈ ఫార్మాట్‌నే నమ్ముకున్నారు. ఇక అయితే ఎప్పుడో కొరటాల శివ తను చేయబోయే ఎన్టీఆర్ సినిమాలో కూడా దేవుని చుట్టూ తిరిగే విధంగా కథ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే కొరటాల ఆచార్య సినిమా కథ కూడా కొంత భాగం దైవత్వం మీద లింక్ అయి ఉంటుందని తెలుస్తుంది... కానీ ఆ సినిమా కొరటాల కెరీర్‌లోనే అట్టర్ ప్లాఫ్ సినిమాగా మిగిలిపోయింది. మళ్ళి కొరటాల ఇదే ఫార్మాట్లో సినిమా తీయడం అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది.

 

మరో యువ హీరో సుధీర్ బాబు కూడా తన చేయబోయే కొత్త సినిమాలో కూడా దేవుని చుట్టూ కథ తిరిగే విధంగా ఉండబోతుందని తెలుస్తుంది. బోయపాటి యువ హీరో రామ్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా బోయపాటి కూడా అఖండ సినిమా లాగా రామ్ సినిమాలో కూడా దైవత్వం గురించి చూపించబోతున్నాడని అయితే తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు మానవుడికి దేవుడు బలం యాడ్ చేయటం అనేది ట్రెండ్‌గా కనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొట్టే వరకు మనోళ్ళు ఈ ట్రెండును వదిలేలా కూడా కనిపించడం లేదటా.

మరింత సమాచారం తెలుసుకోండి: