తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితం విడుదల అయిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ కూడా కొల్ల గొట్టింది. ఇలా హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ మంచి విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ కి సీక్వెల్ గా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ ని తెరకెక్కిస్తున్నారు. హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో అడవి శేషు హీరో గా నటించగా ,  శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 2 బ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా హిట్ ది సెకండ్ కేస్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అప్డేట్ విడుదల చేసింది.  హిట్ ది సెకండ్ కేస్ మూవీ నుండి ఒక అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ రోజు హిట్ ది సెకండ్ కేస్ మూవీ యూనిట్ ఎలాంటి అప్డేట్ ను విడుదల చేయబోతుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేసు మూవీ మంచి విజయం సాధించడంతో హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: