‘కేజీ ఎఫ్’ మూవీతో ఇండియన్ స్టార్ గా మారిపోయిన యష్ కు ప్రభాస్ ను వెంటాడుతున్న సమస్యలు అతడిని కూడ వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కామెంట్స్ యష్ పై రావడానికి ఒక ఆసక్తిగల కారణం ఉంది. ‘బాహుబలి’ విడుదల తరువాత ప్రభాస్ కు దేశవ్యాప్తంగా విపరీతమైన మ్యానియా ఏర్పడటంతో తన తదుపరి సినిమాల ఎంపిక విషయమై చాల కన్ఫ్యూజ్ అయ్యాడు.


ఏమాత్రం అనుభవంలేని దర్శకులతో ‘సాహో’ రాధే శ్యామ్’ సినిమాలను చేసి భారీ ఫ్లాప్ లను తన కెరియర్ లో వేసుకున్నాడు. అయితే ప్రభాస్ కు ఉన్న టాప్ ఇమేజ్ రీత్యా అతడికి వచ్చే అవకాశాలు ఏమాత్రం తగ్గకపోయినా తన సినిమాల ఎంపిక విషయంలో ప్రభాస్ తప్పటడుగు వేసాడు అంటూ కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే.


ఇప్పుడు యష్ కు కూడ బాలీవుడ్ నుండి ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ ప్రభాస్ చేసిన పొరపాట్లు తాను చేయకూడదు అనీ యష్ తన సినిమాల కథల ఎంపికలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నుండి ఎన్నో క్రేజీ ఆఫర్స్ యష్ కు వస్తున్నప్పటికీ వాటిని పక్కకుపెట్టి కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథను ఫైనల్ గా ఒకే చేసినట్లు తెలుస్తోంది.


వాస్తవానికి యష్ కు ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1లో రన్బీర్ చేసిన పాత్ర, రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ప్లాన్ చేసుకున్న ‘కర్ణ’ లో టైటిల్ రోల్ చేసే అవకాశాలు వచ్చినా వాటిని వదులుకుని కేవలం యష్ తనకు బాగా నమ్మకం ఉన్న దక్షిణాది దర్శకులకే అవకాశాలు ఇస్తూ ప్రభాస్ తప్పుల నుండి పాఠాలు నేర్చుకుంటున్నాడు. యష్ కు పెరిగిన క్రేజ్ స్థాయిలో వరసపెట్టి సినిమాలు ఒప్పుకోకుండా చాల ఆచితూచి అడుగులు వేస్తున్న రాఖీ భాయ్ ముందు చూపు ప్రభాస్ కూడ అనుసరిస్తే బాగుంటుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సూచనలు ప్రభాస్ యష్ ను చూసి ఎంతవరకు అనుసరిస్తాడో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: