టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఫరియ అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కే వి దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫరీయా అబ్దుల్లా  సంపాదించుకుంది. జాతి రత్నాలు మూవీ తో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బంగార్రాజు మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ లో ఫరియా అబ్దుల్లా తన అంద చందాలతో ,  డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఫరియా అబ్దుల్లా "లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సంతోష్ శోభన్ హీరోగా నటించగా , ఈ మూవీ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నవంబర్ 4 వ తేదీన విడుదల కాబోతోంది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని అదిరి పోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యంగ్ బ్యూటీ తనకు ఒక దర్శకుడు తో పని చేయాలని డ్రీమ్ ఉంది అని చెప్పు కొచ్చింది.  తాజాగా ఫరీయా అబ్దుల్లా మాట్లాడుతూ ... రాజమౌళి తో పని చేయడం నా డ్రీమ్ అని ,  ఆయన చేసిన సినిమాలు అన్నీ చూశాను అని ,  ఆయన మూవీ లో ఛాన్స్ వస్తే నా కల నెరవేరినట్టే అని ఫారీయ అబ్దుల్లా తాజాగా తన మనసు లో మాట బయట పెట్టింది. ఫరియా అబ్దుల్లా "లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాలి. ఫారియ అబ్దుల్లా ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రావణాసుర మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: