సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమాల నుండి ఎన్నో పాటలు విడుదల అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొన్ని సినిమాల లోని పాటలు విడుదల అయిన అతి తక్కువ సమయం లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకొని అద్భుతమైన వ్యూస్ ను సాధిస్తున్నాయి. అలా ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమా పాటలలో 24 గంటల సమయంలో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 4 సాంగ్స్ గురించి తెలుసుకుందాం.
 
దళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ లోని అరబిక్ కుత్తు అనే సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 24.77 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా , ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వరిసు మూవీ లోని రంజితమే సాంగ్ విడుదలైన 24 గంటల సమయంలో 24.68 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ,  రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లోని పెన్నీ సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 16.68 మిలియన్ వ్యూస్ ను సాధించింది. తమన్మూవీ కి సంగీతం అందించగా ,  కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ లోని కళావతి సాంగ్ విడుదల అయిన 24 గంటల సమయంలో 14.78 మిలియన్ వ్యూస్ ను సాధించింది.  కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా , తమన్మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: