
ఈ “మీసాల పిల్ల” సాంగ్ లిరిక్స్ లోనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. “ఏ మీసాల పిల్లా, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గేలా పిల్లా…” అంటూ సాగిన లైన్స్ చాలా క్యూట్‌గా, క్యాచీగా ఉన్నాయి. చిరంజీవి తన స్టైల్‌లో నయనతారను ఆటపట్టించే సీన్స్ చూస్తే ప్రేక్షకులు మురిసిపోతారు. నయనతార తనను ఆయన ఎగతాళి చేస్తున్నాడని సీరియస్ అయ్యే సన్నివేశం కూడా ప్రోమోలో చూపించారు. దాంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.కానీ ఇక్కడ పెద్ద ప్రశ్న – “మీసాల పిల్ల అంటే అసలు ఏమిటి?” అన్నది. చాలామంది దాన్ని ఒక రకమైన తిట్టు అనుకున్నారు. కానీ చిరంజీవి స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. ఆయన మాటల్లో – “మీసాల పిల్ల అనేది తిట్టు కాదు. మా ఊర్లలో పొగరుబోతు అమ్మాయిని , పొగరుగా ప్రవర్తించే అమ్మాయిలను సరదాగా, ముద్దుగా కుర్రాళ్లు ఇలా పిలుస్తారు” అని చెప్పారు. అంటే అటిట్యూడ్ ఎక్కువగా ఉన్న అమ్మాయిని సరదాగా ఆటపట్టించే స్లాంగ్ అన్నమాట.
ఇది వినగానే అభిమానులు, ముఖ్యంగా యువతలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడే సోషల్ మీడియాలో బాయ్స్ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌కి “మీసాల పిల్లా” అంటూ మెసేజ్‌లు పంపి ఆటపట్టించడం స్టార్ట్ చేశారు. అది కూడా ఒక కొత్త ట్రెండ్‌లా మారిపోయింది. ఈ స్లాంగ్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి చాలా తెలివిగా పట్టుకున్నారు. ఆయన ఎప్పుడూ కామెడీ, మాస్, ఎమోషన్స్ అన్నింటినీ కలిపి చూపించడంలో స్పెషలిస్టే. ఈ సారి కూడా అదే ట్రై చేసి, “మీసాల పిల్ల” అనే పదంతోనే సాంగ్ మొత్తాన్ని హైలైట్‌గా మలిచారు. ఫలితంగా ఈ పాట కేవలం ఒక పాటగానే కాదు, ఒక ట్రెండ్ క్రియేట్ చేసే ఎలిమెంట్‌గా మారింది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ స్క్రోల్ చేసినా – “మీసాల పిల్లా…” అనే మాటే ట్రెండింగ్. మెగా అభిమానులైతే మరీ ఎక్కువగా ఈ పాటను సపోర్ట్ చేస్తూ రీల్‌లు, షార్ట్ వీడియోలు చేస్తున్నారు.మొత్తానికి, చిరంజీవి మళ్లీ ఒకసారి ఘరానా మొగుడు స్టైల్‌లో కనిపించబోతున్నాడనే ఫీలింగ్ ఈ ఒక్క పాట ప్రోమోతోనే అభిమానులకు వచ్చేసింది. అందుకే “మీసాల పిల్ల” సాంగ్ ఇప్పుడు ఈ సినిమా బజ్‌ని మూడింతలు పెంచేసింది.