మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటు వంటి మోనాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోనాల్ "సుడిగాడు" సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ పలు మూవీ లలో హీరోయిన్ గా నటించినప్పటికీ ,  ఆ మూవీ లు ఏవి కూడా మోనాల్ కు సూడిగాడు రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందించలేకపోయాయి. దానితో క్రమంగా మోనాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడిపోయింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గిన సమయం లోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా బిగ్ బాస్ షో ద్వారా మోనాల్ ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక మోనాల్ అల్లుడు అదుర్స్ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. 

మూవీ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించగా నబా నటేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం మోనాల్ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న డాన్స్ ఐకాన్ షో కు జడ్జ్ గా వ్యవహరిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను  పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా మోనాల్ తనకు సంబంధించిన ఒక ఫోటో ను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. మోనాల్ తన ఇన్స్టా లో తాజాగా పోస్ట్ చేసిన ఫోటో లో ట్రెడిషనల్ లుక్ లో శారీ నీ కట్టుకొని ,  అంతే ట్రెడిషనల్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మోనాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెటింట తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: