కేజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ డైరెక్టర్ అయిపోయారు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని కూడా కేజిఎఫ్ చిత్ర నిర్మాతలు తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ చిత్రం పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి అభిమానులలో. ప్రభాస్ నటించిన గత చిత్రాలు అన్ని డిజాస్టర్ కావడంతో ఈ సినిమా పైన మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు అంత సక్సెస్ రాలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తన మార్కును మరొకసారి అందుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇక తాజాగా సలార్ సినిమా నుంచి లీక్ వీడియో ఒకటి బయటకు రావడం జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక మాస్ లుక్ లో కనిపించినట్లుగా తెలుస్తోంది. షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్ కూర్చొని ఉన్న సమయంలో ఈ వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ గుబురు గడ్డంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రంపై ఈ లీకులు బయటకి రావడంతో కాస్త చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. సినిమా షూటింగ్ సెట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే ఎక్కడో ఒకచోట ఇలాంటివి లీక్ అవుతూనే ఉన్నాయని చిత్ర బృందం భావిస్తోంది.కే జి ఎఫ్ చిత్రాన్ని గోల్డ్ మైనింగ్ గురించి ప్రస్తావించిన ప్రశాంత్ నిల్ ఇక ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో నల్ల బంగారం కోల్మైన్ గురించి ఉంటుందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే మొదట ఒకే పార్ట్ గా అనుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ ఏడాది సలార్ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. కే జి ఎఫ్ 2 సినిమా కాస్త ఆలస్యమైందని చెప్పవచ్చు. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా డేట్లు ఎక్కువగా అడ్జస్ట్ చేయడంతో సలార్ సినిమాకు డేట్లు అడ్జస్ట్ చేయలేక పోయినట్లు సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్లో సలార్ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: