యువహీరో ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి.ఇక  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన నాగశౌర్య సైలెంట్ గా పెళ్లి పనులు మొదలుపెట్టేశాడు.అయితే అందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా బయటికి వచ్చేసింది. అయితే గత రెండేళ్లలో చాలామంది తెలుగు హీరోలు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.ఇక  ఇప్పుడు శౌర్య కూడా ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు.ఇదిలావుంటే  తాజాగా శౌర్య పెళ్లికి సంబంధించి ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.అయితే  ఇటీవలే కృష్ణ వ్రిందా విహారి మూవీతో ఫ్యామిలీ హిట్ అందుకున్న శౌర్య.. 

ఏకంగా తన పెళ్లి వార్త చెప్పి అందరిని సర్ప్రైజ్ చేశాడు.ఇక సరే ఇన్విటేషన్ కార్డు వైరల్ అవుతోంది.. ఆ కార్డు మీద నాగశౌర్య – అనూష అని పేర్లు కూడా ఉన్నాయి.. అది కూడా ఓకే.ఇక  మనకు నాగశౌర్య ఎవరో తెలుసు. మరి ఇంతకీ.. ఈ అనూష ఎవరు? ఎక్కడుంటుంది? ఏం చేస్తుంది? అసలు ఆమె ఎలా ఉంటుంది? అనే సందేహాలు ఒక్కసారిగా అందరిలో మొదలయ్యాయి. అయితే అప్పటినుండి క్షణం తీరిక లేకుండా నాగశౌర్య చేసుకోబోయే అమ్మాయి ఎవరు? అని సోషల్ మీడియాలో ఆరా తీయడం ప్రారంభించారు. కానీ.. లాభం లేకుండా పోయింది.ఇదిలావుంటే  తాజాగా ఆ అనూష ఎవరనేది తెలిసిపోయింది.ఇక  ఆమె పూర్తి పేరు.. ఫోటో.. డీటెయిల్స్ కూడా బయటికి వచ్చేశాయి.

అయితే నాగశౌర్యకి కాబోయే అమ్మాయి పూర్తిపేరు అనూష శెట్టి.ఇక  ఈమె బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అని తెలుస్తోంది.  శౌర్య – అనూష కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారని.. ఇరువురి పెద్దలను ఒప్పించే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. అయితే..  ఇక వీరి పరిచయం, ప్రేమ ఎలా జరిగాయనేది మాత్రం తెలియరాలేదు. ఇక పెళ్లి విషయానికి వస్తే.. వీరి పెళ్లి రెండు రోజులపాటు ఘనంగా జరగబోతుంది.కాగా  నవంబర్ 19, 20 తేదీల్లో బెంగళూరులోని విట్టల్ మాల్యా రోడ్‌.. జెడబ్ల్యు మారియట్ హోటల్‌లో వేడుకలు నిర్వహించనున్నారు.అయితే  నవంబర్ 20న ఉదయం 11.25 గంటలకు పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారు.ఇదిలావుంటే  ప్రస్తుతం శౌర్య, అనూషల పెళ్లికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: