సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ సినిమా పడిందంటే చాలు ఇక డైరెక్టర్లను, హీరోలను సైతం ఆకాశానికి ఎత్తేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ భారీ ఫ్లాప్ వస్తే ఇక ఆ హీరో పని అయిపోయింది అంటూ విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఈ స్టేజ్ లోనే ఉందని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించుకున్నారు. 2017 లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులను సైతం సృష్టించింది.


కేవలం ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ ఇప్పటివరకు పలు అవకాశాలను సంపాదిస్తూ ఉన్నారు. అలా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన లైగర్ సినిమా బారి డిజాస్టర్ కావడంతో ఈమధ్య విజయ్ దేవరకొండ పలు వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నారు. ముఖ్యంగా పూరి జగన్నాథ్ కూడా ఈ విషయంలో పలు రకాలుగా ట్రొల్స్  కు గురవుతున్నారని చెప్పవచ్చు. బాలీవుడ్ లో సినిమా చేయకుండానే అక్కడ స్టార్స్ కి ఫేవరెట్ స్టార్ గా మారిపోయారు విజయ్ దేవరకొండ దీంతో ఇతని క్రేజ్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దీంతో విజయ్ దేవరకొండ తో కలిసి పలువురు స్టార్స్ సైతం కమర్షియల్ యాడ్లో చేయడానికి సిద్ధమయ్యారు. ఇక తర్వాత గీత గోవిందం, టాక్సీవాలా వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్నారు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు ఆ తరువాత అంతటి విజయాన్ని మాత్రం అందుకోలేక చాలా సతమతమవుతున్నారు. ఇప్పుడు తాజాగా బ్రహ్మాస్త్ర-2 సినిమాలో దేవ్ పాత్ర నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ నటించిన శివ పాత్రకి తండ్రిగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ ని ఈ చిత్రంలో నటించమని సంప్రదించినట్లుగా సమాచారం. మరి ఈ వార్తలపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: