

ఇక ఈ టైటిల్ లోనే బోలెడంత మాస్ ఉందని గత కొద్దిరోజులుగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ను చూడగానే ఈ విషయాన్ని చెప్పవచ్చు. చిరంజీవి పూర్తిస్థాయిలో మాస్ లుక్ లో కనిపించబోతున్నారని ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమాకు సంబంధించి పలు అప్డేట్లను ప్రకటిస్తూ ఉన్నారు చిత్ర బృందం. ఇక తాజాగా దేవిశ్రీప్రసాద్ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. వీరయ్య సినిమా నుంచి ఒక ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు ఈ పాటకి బాస్ పార్టీ అనే ట్యాగ్ ను తగిలించి దేవి శ్రీ ఒక్కసారిగా హైప్ ని పెంచారు. ఇక ఈ పాట కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.