వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక మూవీ లలో హీరోగా నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న ఈ యువ హీరో ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం మొదట విశ్వక్ సేన్ "అశోకవనంలో అర్జున కళ్యాణం" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

తాజాగా విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి అశ్విత్ మరిముత్తు దర్శకత్వం వహించగా , మిథాలీ పాల్కర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న విశ్వక్ సేన్ ప్రస్తుతం దమ్కి అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో విశ్వక్ సన్ హీరోగా నటించిన మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.

మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. నివేదా పేత్రాజ్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. ధమ్కీ మూవీ హిందీ వెర్షన్ కోసం మొదటి పాట ముంబై లోని వై ఆర్ ఎఫ్ స్టూడియోస్‌లో రికార్డ్ చేయబడింది. నకాష్ అజీజ్ ఈ మూవీ లోని సాంగ్ కోసం వర్క్ చేసినట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ తాజాగా తన ఇన్‌ స్టా గ్రామ్ ప్రొఫైల్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , హిందీ ,  మలయాళ భాషల్లో మూవీ మేకర్స్ విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: