ఇక వీళ్ల తర్వాత కూడా ఎంతోమంది ఢీ షోలో కంటెస్టెంట్లుగా మారి ఆ తర్వాత తమను తాను నిరూపించుకొని డాన్స్ మాస్టర్ గా వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు ఢీ 14వ సీజన్.. డాన్స్ ఐకాన్ ప్రసారం అవుతుంది. ఇక ఇప్పుడు సెమీఫైనల్స్ కు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఇందుకు సంబంధించిన ప్రోమో కాస్త విడుదలైంది. ఇక మరోసారి కంటెస్టెంట్స్ తమ అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు.
అయితే కంటెస్టెంట్స్ డాన్సులు చేయడం ఎప్పుడూ జరిగేదే. కానీ ఇటీవల విడుదలైన ప్రోమోలో ఏకంగా టీం లీడర్లు కూడా డాన్సులతో అదరగొట్టారు. ఒకవైపు అఖిల్ సర్దార్ డాన్స్ చేస్తే మరోవైపు లేడీ టీం లీడర్ శ్వేతా సైతం మత్తెక్కించే డాన్స్ తో అందరిని మంత్రముగ్ధులు చేసింది అని చెప్పాలి. ఇక శ్వేత చేసిన డాన్స్ చూసి జడ్జెస్ సైతం ఫిదా అయిపోయారు. ఏమో అనుకున్నాం కానీ టీం లీడర్ శ్వేతాలో కూడా ఇలాంటి టాలెంట్ దాగుందా అని అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి. శ్వేత డాన్స్ చూసిన తర్వాత తాను కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తానని హైపర్ ఆది కమిట్ అయ్యాడు.