తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేషు ప్రస్తుతం హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తూ ఉండగా , మీనాక్షి చౌదరిమూవీ లో అడవి శేషు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ మూవీ హిట్ ది ఫస్ట్ కేస్ అనే విజయవంతమైన మూవీ కి సీక్వెల్ గా రూపొందుతూ ఉండడంతో , ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా అడవి శేషు హీరోగా తరికెక్కిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ విడుదల రోజునే తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన మట్టి కుస్తీ మూవీ కూడా విడుదల కాబోతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మూవీ ని తెలుగు లో భాషలో కూడా డిసెంబర్ 2 వ తేదీనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని మాస్ మహారాజా రవితేజ సమర్పిస్తున్నాడు. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హిట్ ది సెకండ్ కేస్ మూవీ కి పోటీగా విష్ణు విశాల్ హీరోగా తరికెక్కిన మట్టి కుస్తీ మూవీ ఏ రేంజ్ లో నిలబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: