తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపు ను తెచ్చుకొని , ఆ తర్వాత హీరోగా తనకంటూ అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి అడవి శేషు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్షణం మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో గా మంచి విజయాన్ని అందుకున్న అడవి శేషు , ఆ తరువాత గూఢచారి , ఎవరు , మేజర్ మూవీ లతో వరస విజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేషు హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ డిసెంబర్  2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా అడవి శేషు ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

హిట్ ది సెకండ్ కేస్ మూవీ క్లైమాక్స్ లో మేము హిట్ 3 మూవీ లోని హీరోని పరిచయం చేసాము. అది థ్రిల్లింగ్ మూమెంట్ గా ఉంటుంది అని అడవి శేషు తాజాగా చెప్పుకొచ్చాడు. ఇలా ఎలా ఉంటే ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా , మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న హిట్ ది సెకండ్ కేస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: