ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న టాపిక్ హిందూమతం.. నిజానికి హిందూ మతం కాన్సెప్ట్ గా చేసుకొని తెరకెక్కిన ఎన్నో చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అంతేకాదు ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతూ మరింత పాపులారిటీని దక్కించుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాల క్రితం హార్రర్ కామెడీ సినిమాలు ట్రెండ్ క్రియేట్ చేయగా.. ఆ తర్వాత కాలంలో సీనియర్ హీరోల, హీరోయిన్ల బయోపిక్ ల సినిమాలు బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే ట్రెండ్ కి తగ్గట్టుగా ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించాయి. అంతేకాదు బయోపిక్ ల ద్వారా ఎన్నో తెలియని విషయాలు కూడా అభిమానులకు అలాగే సినీ ప్రేక్షకులకు తెలియడం జరిగింది.

అయితే ఎప్పటికప్పుడు ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు. కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ట్రెండ్ మారుస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే ఇప్పుడు హిందూ మతం పై సినిమాలను తెరకెక్కిస్తున్నారు.  అలా హిందూ మతం ఆధారంగా వచ్చిన సినిమాల విషయానికి వస్తే..కార్తికేయ 2, కాశ్మీర్ ఫైల్స్, బ్రహ్మాస్త్రం, రామసేతు, ఇప్పుడు హనుమాన్.. మొత్తం అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.  ఇప్పుడు హనుమాన్ వంతు వచ్చింది.  ఇందులో హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న తేజ సజ్జా ఇటీవల జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అంతకుముందు ఓ బేబీ సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఇప్పుడు హనుమాన్ సినిమా ద్వారా తనలో ఉన్న మరో కొత్త కోణాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు తేజ సజ్జా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో అమ్రిత్ అయ్యర్ హీరోయిన్గా వస్తున్న ఈ సినిమాలో వినయ్ రాయ్,  వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదివరకే టీజర్ విడుదల అవ్వగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మరొకవైపు హిందూ మతం ఆధారంగా ఆది పురుష్ కూడా వస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: