టాలీవుడ్ యంగ్  హీరో సందీప్  కిషన్  హీరోగా "మానగరం" సినిమాతో దర్శకుడిగా కోలీవుడ్ కి పరిచయమైన లోకేష్ కనగరాజ్ కార్తి హీరోగా నటించిన "ఖైదీ" సినిమాతో ఊహించని రేంజిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.ఆ సినిమా తరువాత విజయ్ హీరోగా "మాస్టర్" సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ ఈ మధ్యనే విడుదలైన "విక్రమ్" సినిమాలో "ఖైదీ" పాత్రలను కూడా యాడ్  చేసి కోలీవుడ్ లో మొట్టమొదటిసారిగా ఒక సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే టాగ్ తో సోషల్ మీడియాలో కూడా సెన్సేషన్ ని సృష్టించారు. ఇప్పటి వరకు కూడా ఖైదీ, విక్రమ్ అని లోకేష్ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఆ రెండూ కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే తాజాగా ఈ యూనివర్స్ లోకి మరొక కొత్త సినిమా యాడ్ అవబోతున్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.అదే విజయ్ 67 వ సినిమా.


లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ హీరోగా ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అదే #తలపతి67. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది కూడా ఒక భాగం కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా డ్రగ్స్, మాఫియా చుట్టూ నడుస్తుందట. దీని గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. గతంలో విజయ్ తో లోకేష్ కనగరాజ్ "మాస్టర్" అనే సినిమా చేశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సెకండ్ సినిమా ఇది. ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీ, కమల్ హాసన్ ఇంకా ఫహద్ ఫాసిల్ వంటి స్టార్ హీరోలు ఉన్నారు. తాజాగా ఇప్పుడు తలపతి విజయ్ కూడా ఈ జాబితాలో చేరనున్నందుకు ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: