హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న వరుణ్ తాజాగా బేడియా అనే హిందీ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కృతి సనన్ , వరుణ్ ధావన్ సరసన హీరోయిన్ గా నటించగా , అమర్ కౌశిక్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని నవంబర్ 25 వ తేదీన హిందీ తో పాటు తెలుగు మరియు తమిళ భాషలలో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని తోడేలు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను తెలుగు లో కూడా విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అత్యద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా తెలుగు సినీ ప్రేమికుల్లో ఈ మూవీ పై మంచి అంచనాలు కలిగి ఉన్న నేపథ్యం లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తోడేలు మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు 2.25  కోట్ల షేర్ కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించినట్లు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: