ప్రామిసింగ్ నటుడు సత్యదేవ్ తాజాగా గుర్తుందా శీతాకాలం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో సత్యదేవ్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ కి నాగ శేఖర్ దర్శకత్వం వహించగా , కాల భైరవమూవీ కి సంగీతం అందించాడు . ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయ గా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది . తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరి పోయే అప్డేట్ ను విడుదల చేసింది . తాజాగా గుర్తుందా శీతాకాలం మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. గుర్తుందా సీతాకాలం మూవీ ని డిసెంబర్ 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. 

మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సత్యదేవ్ ఇప్పటికే ఈ సంవత్సరం అనేక మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కూడా సత్యదేవ్ నటించాడు. ఈ మూవీ లోని ప్రతి నాయకుడి పాత్ర ద్వారా సత్యదేవ్ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సంవత్సరం తమన్నా ఎఫ్ 3 మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా , మెగాస్టార్ చిరంజీవి హీరో గా మెహర్ రమేష్ దర్శకత్వంలో తేరకేక్కుతున్న భోళా శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: