సమంత, రష్మిక, పూజా హెగ్డేలకు ఇప్పుడంటే నేషనల్ లెవెల్లో క్రేజ్ ఉంది. అలాంటి హీరోయిన్లు.. వెండితెరపై కనిపించక ముందు.. సినిమాల్లోకి రాకముందు ఏ ఏ ఉద్యోగాలు చేశారు

వారి మొదటి సంపాదన ఏంటి.. ఎక్కడ పని చేసే వారు అనే ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలని వారి వారి అభిమానులు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్..

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులోకి పరిచయమైన తాప్సీ.. ఇప్పుడు నేషనల్ హీరోయిన్‌గా అయితే మారింది. పింక్, బాద్లా వంటి సినిమాలతో అమితాబ్‌కు ధీటుగా నటించింది తాప్సీ. అయితే ఇండస్ట్రీలోకి రాకముందు తాప్సీ సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ అతి కొద్ది మందికే తెలుసు. తాప్సీ నటనతో పాటు చదువులో కూడా బ్రిల్లియంట్.

సమంత అయితే ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోయిన్ అయింది. ఊ అంటావా మామ అనే ఒక్క పాటతో సమంత క్రేజ్ కూడా మారింది. అలాంటి సమంత చదువుకునే రోజుల్లోనే పాకెట్ మనీ కోసం పెళ్లిళ్లు, ఈవెంట్లలో పని చేసేది. అప్పట్లో సమంత అలా పని చేసి రూ. 500 సంపాదించిన రోజులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చిందటా సమంత.

రష్మికకు ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ ఉంది. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని రష్మికను అయితే పిలుస్తారు. రష్మిక మందన్న తన కెరీర్‌ను 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ప్రారంభించింది. మోడలింగ్ ప్రపంచంలోకి ప్రవేశించి.. అక్కడి నుంచి సినిమా ఆఫర్లను అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌, టాలీవుడ్ అంటూ అంతటా కూడా తిరిగేస్తోంది.

పూజా హెగ్డే ఇప్పుడు జాతీయ స్థాయిలో తన క్రేజ్ పెంచుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సినిమాలో నటించేస్తోంది. ఇక తెలుగులో టాప్ హీరోలతో నటించేసింది. అలాంటి పూజా హెగ్డే సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్, ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా మారింది. 2010 ఐ యామ్ షీ - మిస్ యూనివర్స్ ఇండియాయ పోటీలో రెండవ రన్నరప్‌గా అయితే నిలిచింది.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్‌ వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇక శ్రుతి హాసన్ మ్యూజిక్‌లో స్పెషల్ కోర్సులు చేసింది. ఆమెకంటూ స్పెషల్ బ్యాండ్ ఉంది. 1992లోనే ప్లేబ్యాక్ సింగర్‌గా శ్రుతి తన కెరీర్‌ని ప్రారంభించిందని, అప్పటికీ ఆమె వయస్సు కూడా 6 సంవత్సరాలు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: