గత ఆరు నెలల క్రితం నుంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హావా కొనసాగుతోంది. ముఖ్యంగా తమ అభిమాన హీరోల పుట్టినరోజు సందర్భంగా హీరోల కెరియర్లో బ్లాక్ బస్టర్ విజయాలను సాధించిన సినిమాలను రీ రిలీజ్ చేసి మరింత క్యాష్ చేసుకుంటున్నాడు నిర్వాహకులు. ఇకపోతే ఈ క్రమంలోనే తాజాగా రజనీకాంత్ నటించిన డిజాస్టర్ సినిమా బాబాను రీ రిలీజ్ చేయాలని తెలుగు ఆడియన్స్ కోరుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ సాధించినప్పటికీ కథపరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే తెలుగు ప్రేక్షకుల కోరిక మేరకు రజనీకాంత్ నటించిన బాబా సినిమాను ఈరోజు రీ రిలీజ్ చేయబోతున్నారు.

2002 ఆగస్టు 15వ తేదీన విడుదల చేసిన బాబా సినిమాను  సురేష్ కృష్ణ దర్శకత్వం వహించగా ప్రొడ్యూసర్గా రజనీకాంత్ వ్యవహరించారు. మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ వ్యవహరించడం జరిగింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో  అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.  తమిళ్ చిత్రంగా వచ్చిన ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసి మంచి పాపులారిటీ దక్కించుకోవాలని చూసిన రజనీకాంత్ కు ఈ చిత్రం నిరాశ మిగిల్చింది. లోటస్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మించిన ఈ సినిమాలో చాలామంది సీనియర్ నటీనటులు నటించారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇకపోతే అభిమానుల కోరిక మేరకు  ఈరోజు రి రిలీజ్ చేయబోతున్న ఈ సినిమ ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.ఇకపోతే రజినీకాంత్ విషయానికి వస్తే 70 సంవత్సరాల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయన కొత్త హీరోలకి కూడా పోటీ చేస్తూ పారితోషకం విషయంలో కూడా అంతే డిమాండ్ చేస్తూ దూసుకుపోతున్నారు.. స్క్రీన్ మీద రజినీకాంత్ ఎలా కనిపించినా సరే తన నిజ జీవితంలో మాత్రం చాలా నిరాడంబరంగా ఉంటారు. ఎప్పుడు అభిమానులను కలుస్తూ వారి కోరికలను తీరుస్తూ ఉంటారు రజినీకాంత్ .

మరింత సమాచారం తెలుసుకోండి: