పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అని భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అవుతున్నప్పటికీ కూడా ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది . నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు . ఈ మూవీ లో భారీ యాక్షన్స్ సన్నివేషాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ , యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూ వీలో హీరో గా నటించబోతున్నట్లు ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే .

మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చినప్పటికీ ఈ మూవీ కి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  , సూజిత్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ క్రేజీ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అజ్ఞాతవాసి మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: