పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది శ్రీల. మొదటి సినిమా తోని మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పెళ్లి సందడి సినిమా అనంతరం ఇప్పటివరకు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈమె. అంతేకాకుండా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ లకి ఏమాత్రం తగ్గకుండా స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించే అవకాశాలను అందుకుంటుంది. రోషన్ వంటి  యంగ్ హీరోతో నటించి ఇప్పుడు తండ్రి వయసు ఉన్న రవితేజతో ధమాకా సినిమాలో నటిస్తోంది పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె. 

అయితే ఈ విషయంలో గత కొద్ది రోజులుగా ఈమెపై కొన్ని రకాల విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయాలపై పెళ్లి సందడి ఫెమ్ శ్రీ లీల స్పందించింది. ఇందులో భాగంగానే ఈమె మాట్లాడుతూ పెళ్లి సందడి సినిమా కంటే ముందే రవితేజ గారి ధమాకా సినిమా ఆఫర్ వచ్చిందని వయసుతో ఆమెకి సంబంధం లేదని రవితేజ వంటి స్టార్ హీరోతో నటించడం నా అదృష్టమని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు దాంతోపాటు సినిమాలో ఆమె పాత్ర తనకి నచ్చడం వల్లే సినిమాకి ఓకే చెప్పానని చెప్పుకొచ్చింది. ఇక ధమాకా సినిమా విషయానికొస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు..

త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించడం జరిగింది.రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాలను మేకర్స్ నిర్వహిస్తున్నారు. గతంలో రవితేజ నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాతో అయినా రవితేజ  కి మంచి కంబాక్ ఇస్తుందా  లేదా అన్నది చూడాలి.డిసెంబర్ 23న విడుదల కానున్న ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ధమాకా తో రవితేజ తిరిగి హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: