సంక్రాంతి పండుగ దగ్గరపడుతూ ఉండటంతో సంక్రాంతి రేస్ కు విడుదల కాబోతున్న సినిమాల హడావిడి కూడ టాప్ రేంజ్ లో నడుస్తోంది. సంక్రాంతికి విడుదలకాబోతున్న సినిమాలలో చిరంజీవి ‘వాల్టేర్ వీరయ్య’ ఇప్పుడు ప్రచారంలో చాల ముందు ఉంది. సాధారణంగా ఒక ప్రముఖ సినిమా విడుదల అయినప్పుడు ఆసినిమా ఇంటర్వెల్ లో త్వరలో విడుదలకాబోయే ఒక భారీ సినిమా ట్రైలర్ లేదా టీజర్ ప్రదర్శించడం ఎప్పటి నుంచో జరుగుతున్న అలవాటు.



అయితే దీనికి భిన్నంగా ‘వాల్టేర్ వీరయ్య’ యూనిట్ డిఫరెంట్ గా ఆలోచించి ‘అవతార్ 2’ మూవీ ఇంటర్వెల్ లో ఇప్పటికే సూపర్ హిట్ అయిన ‘బాస్ పార్టీ’ సాంగ్ లిరికల్ వీడియోను ‘అవతార్ 2’ ప్రదర్శిస్తున్న ధియేటర్లు అన్నింటిలోను ప్రదర్శిస్తూ ఉండటంతో సంక్రాంతికి విడుదలకాబోతున్న ఈమూవీకి విపరీతమైన పబ్లిసిటీ జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈమూవీ ప్రమోషన్ ను రోజురోజుకు ఒకొక్క మెట్టు ఎక్కిస్తూ ఈమూవీ పై విపరీతమైన మ్యానియా ఏర్పడే విధంగా పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారని టాక్.


ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితులలో ఈ ఫంక్షన్ కు ఉభయ రాష్ట్రాల నుండి కనీసం లక్ష మంది మెగా అభిమానులు వచ్చి ఈ ఫంక్షన్ ను సక్సస్ చేసే విధంగా ఇప్పటికే చిరంజీవి పిఆర్ టీమ్ మెగా స్టార్ అభిమాన సంఘాలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.



చిరంజీవి బాలకృష్ణ లు సంక్రాంతి రేస్ లో పోటీపడినప్పుడు వీరుఇరువరికీ అదృష్టం ఒకోక్కసారి వరిస్తూ వచ్చింది. దీనితో ఈసారి జరగబోతున్న ‘వాల్టేర్ వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ రేస్ లో ఎవరు విజేత అన్న విషయం పై ఇప్పటి నుంచే పందాలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి పబ్లిసిటీ విషయంలో ‘వీరసింహా రెడ్డి’ కంటే ‘వాల్టేర్ వీరయ్య’ పై చేయిగా కనిపిస్తున్నప్పటికీ చివరి రోజులలో ఎవరు ఎవరి పై పైచేయి సాధిస్తారు అన్న విషయం సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: