హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ తాను హీరోగా నటించడమే కాదు ఇతర హీరోల సినిమాల్లో కూడా స్పెషల్ రోల్స్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. ఈ క్రమంలోని రవితేజకు అన్నయ్యతో సమానమైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్యా సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు రవితేజ అన్న విషయం తెలిసిందే.


 రవితేజ హీరోగా నటించిన ధమాకా మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంతకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్లలో పాల్గొన్న రవితేజ సినిమా విశేషాలతో పాటు ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కున వాల్తేరు వీరయ్య మూవీలో చేస్తున్న ప్రత్యేకమైన పాత్ర గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా యువ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


 ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ మాస్ రోల్ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఇక ఇటీవల రవితేజ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా తెలంగాణ యాసలో పవర్ ఫుల్ డైలాగ్ లు చెబుతూ కనిపించాడు రవితేజ. ఈ క్రమంలోనే ఇటీవలే తన పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో ఎసిపి విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించబోతున్నాడట రవితేజ. గతంలో పవర్ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ గా చూపించిన బాబి ఇక ఇప్పుడు మరోసారి ఎలా చూపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే రవితేజ మాట్లాడుతూ వాల్తేరు వీలయ్య నాకు చాలా స్పెషల్.. అన్నయ్య చిరంజీవితో నటించడం  గొప్ప అనుభవం. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన తో కలిసి మూవీ చేయడం చాలా గొప్పగా అనిపించింది. కథ కథనాలు చక్కగా కుదురాయ్. వాల్తేరు వీరయ్య మూవీలో నా పాత్ర చాలా పవర్ఫుల్.. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చాక నా పాత్ర మీకు నచ్చిందో లేదో మీరే చెప్పాలి అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: