ప్రభాస్ మారుతిల లేటెస్ట్ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ భవనం సెట్ లో సుమారు రెండు వారాలు పైగా షూట్ చేసారని వార్తలు వస్తున్నాయి. ‘రాజా డీలక్స్’ అన్న టైటిల్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీలో ఒక దెయ్యం కూడ కీలక పాత్రలో కనిపిస్తుందని టాక్.


ప్రస్తుతం ప్రేక్షకులు హారర్ మూవీలను బాగా ఇష్టపడుతూ ఉండటంతో ఆ ట్రెండ్ కు అనుగుణంగా ఈమూవీని ప్రభాస్ రేంజ్ లో తీస్తున్నట్లు టాక్. ఇప్పటివరకు ప్రభాస్ కెరియర్ లో చేయని ఒక కామెడీ టచ్ ఉన్న హారర్ జోనర్ మూవీ ఇది అంటున్నారు. లేటెస్ట్ గా పూర్తి అయిన ఈమూవీ షెడ్యూల్ లో ప్రభాస్ అతడి పక్కన హీరోయిన్స్ గా నటిస్తున్న నిధి అగ్రవాల్ మాళవిక మోహన్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇప్పటివరకు చిత్రీకరించిన ఆసన్నివేసాలకు సంబంధించి ఒక గాసిప్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. నిధి అగ్రవాల్ ప్రభాస్ ల మధ్య తీసిన సన్నివేశాలలో నిధి ప్రభాస్ ముందు తేలిపోయిందని అదేవిధంగా వీరిద్దరి మధ్య స్క్రీన్ లవ్ కెమిస్ట్రీ బాగా కుదరలేదు అన్న అభిప్రాయం మారుతికి ఏర్పడింది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో ఈమూవీ నుండి నిధి ని తొలగించి మరొక గ్లామర్ బ్యూటీని ప్రభాస్ పక్కన పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో మారుతి ఉన్నట్లు టాక్.


ఇప్పటికే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో సినిమా చేయడం పై అంత సంతృప్తికరంగా లేని అతడి అభిమానులు ప్రభాస్ పక్కన ఏమాత్రం ఇమేజ్ లేని నిధి అగ్రవాల్ ఏమి బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈవిషయాలు అన్నీ మారుతి దృష్టి వరకు రావడంతో ఈమూవీ నుండి నిధి ని తప్పిస్తున్నారు అన్న వార్తలలో ఎన్ని నిజాలో తెలియనప్పటికీ ఈ వార్తలే నిజం అయితే యంగ్ హీరోయిన్ నిధి అగ్రవాల్ కు ఒక గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: