పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హైట్, అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. సాధారణ ప్రేక్షకులు నుండి సినీ సెలబ్రిటీలో సైతం ప్రభాస్ ను ఇష్టపడుతూ ఉంటారు.చాలా సందర్భాలలో కొందరు స్టార్ హీరోయిన్ లో వారికి సంబంధించిన ఇంటర్వ్యూలలో భాగంగా తమ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే ప్రభాస్ అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో నటించిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపును తెచ్చుకొని దూసుకుపోతున్నాడు.

 అయితే ఎన్నో సినిమాలు చేసి విజయాన్ని అందుకున్నప్పటికీ ప్రభాస్ పెళ్లి మాత్రం ఇంకా చేసుకోలేదు. ఇక సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ పెళ్లి కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ఏవో ఒకటి వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు మంచి గుర్తింపును తెచ్చుకున్న అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని త్వరలోనే వీరిద్దరికీ పెళ్లి కూడా జరగబోతుంది అంటూ చాలా వార్తలే వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అలాంటి వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అని తెలిసింది. అయితే ఇప్పుడు ప్రభాస్ ప్రేమాయణం గురించి సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి .

అయితే ప్రభాస్ ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇక ఆమె ఎవరో కాదు త్రిష. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈమె ప్రభాస్ గాఢంగా ప్రేమిస్తున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించడం జరిగింది.వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాయి. వీరిద్దరి జోడి కి అభిమానుల్లో ఒక ప్రత్యేక గుర్తింపు  ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇక కృష్ణంరాజుకి త్రిష అంటే అమితమైన ప్రేమంట. వీరిద్దరి పెళ్ళికి కూడా కృష్ణంరాజు ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక అదే సమయంలో త్రిష వేరొకరితో ప్రేమలో ఉంది అని వార్తలు విన్న ప్రభాస్ ఆమెను దూరం పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: