టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది శ్రీ లీల. ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో టాప్ హీరోయిన్గా చలామణి అవుతుంది ఈమె. ప్రస్తుతం కుర్రకారులందరికీ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది శ్రీ లీల. ఈమెకి జస్ట్ 21 సంవత్సరాలు కానీ ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం మిలియన్ రేంజ్ లలో ఉంటుంది. కన్నడలో రెండు సినిమాల్లో నటించిన అనంతరం తెలుగులో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా నటించిన అనంతరం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా చలామణి అవుతున్న మాస్ మహారాజా రవితేజతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఈమె. 

తాజాగా ధమాకా సినిమాలో నటించిన ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ధమాకా సినిమా పెళ్లి సందడి సినిమా కంటే ముందే ఈమె దగ్గరికి రావడం జరిగిందట. కానీ ముందు పెళ్లి సందడి సినిమాలో నటించి అనంతరం ధమాకా సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం రామ్ సినిమాలో నటిస్తోంది. ఈమె ఆయనతో పాటు హీరో వైష్ణవి తేజ్ సినిమాలో కూడా నటించడానికి రెడీగా ఉంది. వీరిద్దరే కాదు హీరో నితిన్ మరియు యంగ్ హీరో అయినటువంటి నవీన్ పోలిశెట్టి సినిమాలలో కూడా నటించేందుకు ఓకే చెప్పిందట శ్రీ లీల.

ఇదిలా ఉంటే ఇక మాస్ మహారాజ రవితేజ కి జోడిగా నటించిన ధమాకా సినిమా కి గాను శ్రీ లీల ఏకంగా 40 లక్షల పారితోషకాన్ని అందుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆమె సైన్ చేసిన సినిమాలకి మాత్రం కోటి రూపాయల దాకా రెమ్యూనరేషన్ను డిమాండ్ చేస్తుందట. అయితే తాజాగా తన సినిమాలో తొందరగా డేట్స్ ఎడ్జస్ట్ చేసుకుని నటిస్తే ఏకంగా 1.5 కోట్ల రెమ్యూనరేషన్ను ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడట ఒక నిర్మాత. సాధారణంగా డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అని చాలామంది సినీ సెలబ్రిటీలు చెబుతూ ఉండడం మనం చూసాం. కానీ శ్రీ లీల మాత్రం ఒక వైపు ఎంబిబిఎస్ చదువుతూనే సినిమాలలో కూడా నటిస్తోంది .ఒకవైపు చదువు మరోవైపు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది శ్రీ లీల. దీంతో ఈమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్  కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: