నీ మనసు నాకు తెలుసు సినిమా నుంచి త్రిష ఇప్పటికీ సౌత్ ఆడియన్స్ ని తన మాయలో పడేస్తూనే ఉంది. రెండు దశాబ్ధాలుగా తన టాలెంట్ తో మెప్పిస్తూ వస్తున్న త్రిష కెరీర్ ముగిసింది అనుకున్న ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో తిరిగి సినిమాలు చేస్తూ వస్తుంది. మొన్నటిదాకా తమిళంలో అర కొర సినిమాలతో కెరీర్ వెళ్లదీస్తూ వచ్చిన త్రిష ఇప్పుడు మళ్లె స్టార్ స్టేటస్ కొనసాగిస్తుంది. పి.ఎస్ 1 లో ఆమె నటనతో మరోసారి తమిళ తంబీలను మెప్పించగా లేటెస్ట్ గా దళపతి విజయ్ సినిమాలో కూడా ఆమె అవకాశం అందుకుంది.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న సినిమాలో త్రిష నటిస్తుందని తెలిసిందే. ఇక ఇదే క్రేజీ న్యూస్ అనుకుంటే ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ లో అమ్మడు ఛాన్స్ అందుకుంది. అది కూడా మరో స్టార్ హీరో అజిత్ సినిమాలో త్రిష లక్కీ ఛాన్స్ కొట్టేసింది. కోలీవుడ్ లో త్రిష ఫాం కొనసాగిస్తుందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. త్రిష విజయ్ 62వ సినిమాతో పాటుగా అజిత్ 62వ సినిమాలో కూడా నటిస్తుంది. అజిత్ విఘ్నేష్ శివన్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీలో హీరోయిన్ గా త్రిషని ఫైనల్ చేశారట.

మాతృ భాషలో త్రిష తన వీరంగం చూపిస్తుంది. వరుస అవకాశాలతో అమ్మడు అక్కడ టాప్ లేపేస్తుంది. అయితే తెలుగులో అవకాశాలు వస్తే మాత్రం ఏదో ఒక రీజన్ చెప్పి స్కిప్ చేస్తుంది. దానికి కారణం మాత్రం తెలియట్లేదు. కోలీవుడ్ లో త్రిష ఇప్పటికీ ఇంకా స్టార్ ఛాన్స్ లు అందుకోవడం వెనక రీజన్ ఆమె టాలెంట్ అని అంటున్నారు. అంతేకాదు ఈమధ్య ఆమె లుక్స్ కూడా అందరిని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. త్రిష ఏం మెయింటైన్ చేస్తుందో కానీ ఆమె ఛార్మింగ్ లుక్స్ దర్శక నిర్మాతలను ఎట్రాక్ట్ చేస్తుంది. కొత్త హీరోయిన్స్ తో రిస్క్ చేసే కన్నా త్రిషతో కొంత మైలేజ్ వస్తుందని ఆమెని రిపీట్ చేస్తున్నారు. మొత్తానికి త్రిషకి కోలీవుడ్ లో మళ్లీ మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: