బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న యాంకర్ లాస్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన తోటి యాంకర్ అయిన రవితో కలిసి చాలా షోలలో యాంకర్ గా వ్యవహరించింది లాస్య .ఇటీవల కాలంలో ఆమె బిగ్ బాస్ సీజన్ 4  లో కూడా రావడం జరిగింది. తన అందంతో, మాటలతో, అల్లరితో ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె తన కెరీర్ కు మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. యాంకర్ గా మరియు పలు కామెడీ షో లతో అలరించిన ఈమె

 తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్టేజ్ కి వచ్చాను అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మంజునాథ్ ను ఈమె పెళ్లి చేసుకుంది. ఇక ప్రేమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని ప్రతి విషయంలోనూ తన భర్త ఆమెకి తోడుగా ఉన్నాడని చాలా సందర్భాలలో చెప్పింది యాంకర్ లాస్య.అయితే లాస్యకి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుంది లాస్య . అయితే దీనికి సంబంధించి ఈమె తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను పెట్టింది లాస్య.

దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఆ పోస్టులో భాగంగా లాస్యతను భర్తతో బెడ్రూంలో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందుకుగాను నా భర్తకు పీరియడ్స్ పెయిన్ కోసం చెప్తే దాన్ని 9 నెలలు దూరం చేస్తా అంటూ నన్ను గర్భవతి చేశాడు అంటూ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది . ఈ పోస్టును చదివిన చాలా మంది నెటిజన్స్ ఏంటి ఈమె ఇలాంటి పోస్టును పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో యాంకర్ గ్లాస్ లో పెట్టిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: