తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం తమిళ్ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో మూవీలలో నటించినప్పటికీ ఏ మూవీ లో కూడా మితిమీరిన అందాల ప్రదర్శన చేయకుండా ... సాంప్రదాయ బద్ధమైన ... పద్ధతి గల అమ్మాయి పాత్రలలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

అలాగే ఎక్కువ శాతం కమర్షియల్ మూవీలలో నటించకుండా ... చాలా వరకు కథకు ప్రాధాన్యత ఉన్న మూవీ లలో నటించి తన నటన తో కూడా ఐశ్వర్య  ప్రేక్షకుల మనసు దోచుకుంది . ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఎక్కువగా స్కిన్ షో కు దూరంగా ఉంటున్న ఐశ్వర్య  తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అదే విధంగా స్కిన్ షో కు దూరంగా ఉంటూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన వెరీ క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ... అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో భాగంగా తాజాగా ఐశ్వర్య  కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య ఇటు తెలుగు అటు తమిళ ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: