సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం వీరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా  మల్టీస్టారర్ గా తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో తమిళ హీరో విక్రమ్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట. అంతేకాదు ఇక ఆ పాత్రను బాలయ్యతో చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడు రాజమౌళి.  

త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసి దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. దీనికిగాను వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాని 2024 సమ్మర్లో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ వార్త విన్న అభిమానులు సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకక్కుతున్న ఈ సినిమాని రాజమౌళి బిగ్గెస్ట్ అడ్వెంచర్స్ డ్రామాగా తెరకెక్కించనునట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్సినిమా గురించి మాట్లాడుతూ ..

సినిమా ఆఫ్రికన్ జంగిల్ బెస్ట్ అడ్వెంచర్ అని ఇందులో చాలా యాక్షన్ త్రిల్ మరియు డ్రామా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే గనక నిజమైతే రాజమౌళి సినీ కెరియర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని వీరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ మరియు రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. రాజమౌళి సైతం ఆయన గతంలో తెరకెక్కించిన బాహుబలి సినిమా అనంతరం తన చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈయన హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: