అక్కినేని హీరోలకు గత కొంతకాలంగా హిట్ సినిమాలు లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన  స్టార్ హీరోగా క్రేజ్ ను అందుకో లేకపోయినప్పటికీ మంచి గుర్తింపును మాత్రం తెచ్చుకున్నాడు.ఈయన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్ అందుకున్న అఖిల్ దాని అనంతరం  హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఏజెంట్ కావడంతో ఈయన అభిమానులు ఈ సినిమా కోసం దయ ఎదురుచూస్తున్నారు. 

దీంతో చాలామంది అఖిల్ అభిమానులు ఈ సినిమాతో అఖిల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాడు అని భావిస్తున్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమా అని స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్నారు.అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాని ఈ ఏడాది విడుదల చేయాలని భావించారు. ఆగస్టులో ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ క్రిస్మస్ కి వాయిదా వేశారు. దాని అనంతరం 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 తాజాగా ఈ వార్తల్లో కూడా నిజం లేదని తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాని ఫిబ్రవరిన రిలీజ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని విడుదల చేయాలని భావించినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ చాలా ఆలస్యం అవుతుంది అన్న తరుణంలో ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఫిబ్రవరి మూడో వారంలో రిలీజ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.. దీనికిగాను కొత్త సంవత్సరం కానుకగా ఏజెంట్ సినిమాకి సంబంధించిన ఒక స్టైలిష్ పోస్టర్ని కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు ఏజెంట్ చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా మెన్షన్ చేయాలి అన్నట్లుగా భావిస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: