ప్రముఖ వివాదాస్పద నటి ఎవరు అంటే ముందుగా వినిపించే పేరు నటి శ్రీరెడ్డి. ఈమె గతంలో సాక్షి ఛానల్ లో జర్నలిస్టుగా పనిచేసింది. దాని అనంతరం సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేసినప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయింది. దీంతో ఈమె సినీ సెలబ్రిటీలు మరియు పొలిటీషియన్స్ పై ఎప్పటికప్పుడు నోరు జారుతూ సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది.ఈమె మాట్లాడే మాటలు కొన్ని నిజం లాగ అనిపిస్తాయి. అయినప్పటికీ ఆమె మాట్లాడే మాటల్లో ఎటువంటి నిజం ఉండదు. గతంలో ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏ రేంజ్ లో ఫైర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దాని అనంతరం నాచురల్ స్టార్ నాని, రానా దాని అనంతరం రకుల్ ప్రీత్ సింగ్ ఇలా వరుస సినీ సెలబ్రిటీల గురించి తనదైన శైలిలో వివాదంని రేకెత్తిస్తుంటుంది శ్రీరెడ్డి.అయితే తాజాగా ఈమె జబర్దస్త్ పాపులర్ కమెడియన్ హైపర్ ఆది పై రెచ్చిపోయింది. అయితే ఈమె హైపర్ ఆదిని టార్గెట్ చేస్తూ అనేకమైన మాటలు జారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఇక ఈ ఫంక్షన్ కి గాను జబర్దస్త్ టీం మొత్తాన్ని ఆహ్వానించింది రోజా.ఇందులో భాగంగానే హైపర్ ఆది కూడా ఈ ఫంక్షన్ కి రావడం జరిగింది. ఇక ఈ ఫంక్షన్ లో జగన్ గురించి మాట్లాడుతూ చాలామంది ఆయన గొప్పల గురించి మాట్లాడారు.

కానీ హైపర్ ఆది మాత్రం ఆయన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడాడు. అందుకుగాను శ్రీరెడ్డి హైపర్ ఆది పై ఫైర్ అయింది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.." హైపర్ ఆది నీ కుక్క బుద్ధి మళ్లీ చూపించావ్.. అంత పెద్ద ఫంక్షన్ లో జగన్ గురించి మాట్లాడతావా.. నువ్వు ఏమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా.. ఇష్టం లేనప్పుడు ఎందుకు ఆ ఫంక్షన్ కి వచ్చావు.. అసలు నిన్ను కాదు నిన్ను పిలిచినా ఆరోజు అని అనాలి... నువ్వు లేకుంటే ఏమైనా ఈ ఫంక్షన్ ఆగిపోతుందా.. అసలు నిన్ను ఎవడు పిలిచారు.. అసలు సిగ్గు లేకుండా ఎందుకు ఆ ఫంక్షన్ కి వచ్చావు.. డబ్బులు ఇస్తే ఎలాంటి పని అయినా చేస్తావా.. అంటూ హైపర్ ఆది పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది శ్రీరెడ్డి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: