నటసింహా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో భారీ ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ షో సీజన్ వన్ సూపర్ డూపర్ రెస్పాన్స్ ని కనబరిచింది. ఇక ఇటీవల మొదలైన సీజన్ 2 ఇప్పటికే పలు ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా సీజన్ వన్ కంటే సీజన్ 2 కి కాస్త క్రేజ్ తగ్గిందనే చెప్పాలి.ఇలాంటి తరుణంలో మన పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్ ఎంట్రీ తో ఒక్కసారిగా టాక్ అంతా రివర్స్ అయిపోయింది.డార్లింగ్ ఫాన్స్ దెబ్బకి ఆహా ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ఎపిసోడ్ తో ఆహా ఓటిటి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.ప్రభాస్ ఎపిసోడ్ ఈ రేంజ్ లో ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఇంకే రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ జరిగిన రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత హంగామా చేశారో తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తోనే సీజన్ 2 ఎండ్ అవుతుందని అంటున్నారు. ఇక ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ టు జనవరి 6న ప్రసారం కాబోతోంది ఆ తర్వాత జనవరి 13న వీర సింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ ఉంటుందని చెప్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కంటే ముందే మరో సూపర్ స్టార్ ఎపిసోడ్ ఉండబోతుందని తాజా సమాచారం వినిపిస్తోంది. ఇంతకీ ఆ సూపర్ స్టార్ మరెవరో కాదు విశ్వ నటుడు కోలీవుడ్ సీనియర్ స్టార్ కమల్ హాసన్ బాలయ్య టాక్ షో కి రాబోతున్నాడట. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా కమలహాసన్ కి భారీ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవలే విక్రమ్ సినిమాతో సంచన విజయాన్ని అందుకొని తన క్రేజ్ ని అమాంతం పెంచుకున్నాడు.ఈ క్రమంలోనే జనవరి 6వ తేదీన కమలహాసన్ వచ్చే ఎపిసోడ్ ని షూట్ చేయబోతున్నారట. ఇక ఈ ఎపిసోడ్ ని సంక్రాంతి పండగ కానుకగా ఆహా లో ప్రసారం చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక బాలయ్య టాక్స్ కి కమలహాసన్ కూడా రాబోతూ ఉండడంతో ఈ షోపై ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రభాస్ ఎపిసోడ్ లాగా రెండు భాగాలు టెలికాస్ట్ చేయాలా లేదా ఒక ఎపిసోడ్ లాగా టెలికాస్ట్ చేయాల అనే డైల మాలో ఆహా టీం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సీజన్ 2 ఎండింగ్ వచ్చేసరికి మరోసారి బాలయ్య అన్ స్టాపబుల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: