తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ఆఖరుగా భారీ బడ్జెట్ తో రూపొందిన బీస్ట్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించిన విజయ్ తాజాగా వారిసు అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటలలో ఒకరు అయినటు వంటి శ్రీకాంత్ ... విజయ్ కి సోదరుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమాను తెలుగు లో కూడా ఇదే తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని వారసుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా యూనిట్ ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే జనవరి 12 వ తేదీ వరకు వేచి చూడాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: