మెగాస్టార్ చిరంజీవి మరియు శృతిహాసన్ కాంబినేషన్లో బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న వాల్తేరు వీరయ్య సినిమాసంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితోపాటు మాస్ మహారాజా రవితేజ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఇక తాజాగా విశాఖపట్నంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అద్భుతంగా నిర్వహించారు.దింతో చాలామంది చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ఫుల్ లెన్త్ మాస్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయనున్నారు అని తెగ సంతోషిస్తున్నారు. 

ఖైదీ నెంబర్ 150 తరువాత మళ్లీ సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావడంతో మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఏకంగా బాయికాట్ వాల్తేరు వీరయ్య అనే హెయిర్ స్టైల్ ని ట్రెండ్ చేస్తున్నారు.అయితే మెగాస్టార్ చిరంజీవి పోస్టర్లో చిరంజీవి ఒక పడవ మీద నిలబడి వస్తూ ఉంటారు. ఇక ఆ పడవ మీద చిరంజీవికి ఎంతో ఇష్టమైన ఆంజనేయస్వామి ఫోటోతో ఒక జెండా ఉంటుంది.

 దీంతో ఈ పోస్టర్ను చూసిన చాలా మంది హనుమంతుడి జెండా పక్కన నిలబడి బీడీ కాల్చడం ఏంటి? ఇది దేవుని అవమానించినట్లు కాదా అని ప్రశ్నిస్తూ ఏకంగా బాయికాట్ వాల్తేరు వీరయ్య అనే హాష్ టాగ్ పెడుతున్నారు. అయితే చిరంజీవి ఆంజనేయ స్వామి భక్తుడు అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. పలుసార్లు చిరంజీవి హనుమాన్ దీక్ష కూడా తీసుకున్నారు. దీంతో ఆంజనేయ స్వామి మీద అభిమానంతో పడవ మీద జెండా పెట్టుకొని ఉండొచ్చు కానీ కావాలని ఎవరు అలా చేయరు కదా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు .ఇక ఈ విషయంపై ఈ సినిమా డైరెక్టర్ బావి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: