టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన గాడ్సే మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది మలయాళీ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి. ఆ తర్వాత అమ్ము సినిమాతో నటనపరంగా చాలా మంచి మార్కులు కొట్టేసింది.ఇంకా ఇవే కాకుండా డబ్బింగ్ సినిమాలతో కూడా ఆమె ఎంతగానో అలరించింది. రీసెంట్ గా తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ జోడిగా మట్టీ కుస్తీ లో కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీతో మరోసారి సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీగా అయ్యింది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు తన కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే తాను ప్రేమలో పడినట్లు చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన ఇన్ స్టా పోస్ట్ ఒకటి నెట్టింట బాగా వైరలవుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడింది కూడా సినీ ప్రియులకు సుపరిచితమైన నటుడు కావడం విశేషం. ఆ నటుడే తమిళ్ నటుడు అర్జున్ దాస్. అతనితో తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలిపింది ఈ బ్యూటీ.ఇక అంతేగాక అర్జున్ తో దిగిన ఓ ఫోటోను కూడా షేర్ చేసింది.ఇక తమ ప్రేమకు గుర్తుగా లవ్ సింబల్ కూడా మెన్షన్ చేసింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ ఫోటో  సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది.


ఇక ఇదిలా ఉండగా... మరోవైపు పలువురు సినీ స్టార్స్ వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఖైదీ,మాస్టర్ ఇంకా విక్రమ్ లతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్.. ప్రస్తుతం తెలుగులో బుట్టబొమ్మ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే నెలలో  ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఇప్పుడు గతంలో ఐశ్వర్య పెళ్లి గురించి చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి గురించి వైరల్ కామెంట్స్ చేసింది. అందులో మీకు ప్రేమ పెళ్లి ఇష్టమా ? పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఇష్టమా? అనే ప్రశ్నకు ఈ బ్యూటీ స్పందిస్తూ… తనకు పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదని కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడు ఏకంగా ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. లవ్ సింబల్ కూడా జత చేసి  అభిమానులకు పెద్దగా షాకిచ్చింది ఐశ్వర్య. అయితే వీరిద్దరు నిజంగానే లవ్ లో ఉన్నారా ? లేకా.. తమ తరువాత సినిమా ప్రమోషన్ కోసం ఇలా పోస్ట్ చేశారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: