మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా అనంతరం వరుస సినిమాలకు ఓకే చెబుతూ బిజీగా ఉన్నాడు .ఈ నేపద్యంలోనే రామ్ చరణ్ మరో కొత్త ప్రాజెక్టుకి ఓకే చేశారు అని తెలుస్తుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిననూరితో ఓ సినిమా చేయనున్నట్లుగా తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రకటించడమే కాకుండా త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు అని వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సిల్ అయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఇక ఆ ప్రాజెక్టుని విజయ్ దేవరకొండ చేస్తున్నాడు అన్న కొత్త వార్తలు సైతం వినిపిస్తున్నాయి. అయితే పాన్ ఇండియా హీరో అయినందుకో లేక ఆ సినిమా స్టోరీ నచ్చకో తెలియదు గాని రామ్ చరణ్సినిమా నుండి తప్పుకున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ రంగస్థలం టు మరియు బుచ్చిబాబు సినిమాను మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.దింతో ఈ సినిమా డైరెక్టర్ మరొక హీరోని ఈ సినిమాకి ఫిక్స్ చేయాలి అని భావిస్తున్నారు.ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండసినిమా చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. డైరెక్టర్ స్టొరీని వినిపించిన అనంతరం స్టోరీ నచ్చడంతో త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ క్రమంలోని తాజాగా vd12 టైటిల్ను గౌతం అనౌన్స్ చేశారు. ఇక ఆ పోస్టర్లో ముఖానికి బ్లాక్ మాస్క్ వేసుకున్న ఒక పోలీస్ లాగా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పై రోల్ చేస్తున్నారు అని ఒక హింటును మేకర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొదటిసారి గౌతమ్ ఇలాంటి సినిమా చేయడంతో ఈ సినిమాపై భరించనాలు నెలకొన్నాయి. ఇక ఈ పోస్ట్ చూసిన చాలామంది రాంచరణ్ అభిమానులు ఈ సినిమా రామ్ చరణ్ చేస్తేనే బాగుంటుంది అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చరణ్ అయితే ఇంకా ఈ సినిమా బాగుండేది అన్న కామెంట్లను సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: