తమిళ హీరో జయం రవి హీరోగా తన అన్న డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ "తని ఒరువన్". ఈ సినిమా 2015 లో విడుదలై కెరీర్ ఇక క్లోజ్ అయిపోయింది అనుకున్న జయం రవికి ఊపిరి పోసింది అని చెప్పాలి. ఇందులో జయం రవి మిత్రన్ ఐపీఎస్ గా పాత్రకు ప్రాణం పోశాడు. ఇక మిగిలిన పాత్రలలో నటించిన నాజర్, అరవింద్ స్వామి, నయనతార , గణేష్ మరియు హరీష్ లు సినిమా విజయంలో కీలక భూమిక పోషించారు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు థియేటర్ లో కూర్చుని పెట్టడంలో మోహన్ రాజా సక్సెస్ అయ్యాడు.

ఈ సినిమాను ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు కేవలం 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా , ఫుల్ రన్ లో 105 కోట్ల కలెక్షన్ లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగులోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక తెలుగులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. కానీ తెలుగులో సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు తని ఒరువన్ కు రీమేక్ ను చేయడానికి హీరో జయం రవి మరియు డైరెక్టర్ మోహన్ రాజాలు అనుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా జయం రవి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ గురించి శుభవార్త చెప్పారు.

ఈయన మాటల ప్రకారం ఎప్పటి నుండో సీక్వెల్ ను తీయడానికి చూస్తున్నామని కానీ కుదరడం లేదని.. ఇన్నాళ్లకు ఈ సినిమాను చేసే టైం వచ్చిందని.. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయిందని.. ప్రస్తుతం మోహన్ రాజా మరియు జయం రవిలు వేరే వేరే ప్రాజెక్టులతో బిజీ గా ఉన్నారని.. త్వరలోనే సినిమా షూటింగ్ ఉంటుందని తెలిపాడు. దీనితో మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. రామ్ చరణ్ ధృవ సీక్వెల్ ను కూడా ఈ సినిమా తర్వాత నిర్మించనున్నారని భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: