నందమూరి బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా , హాని రోజ్ ఒక కీలకమైన పాత్రలో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా , ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందించాడు. 

ఈ సినిమాను జనవరి 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ మూవీ కి ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్ లు ప్రపంచవ్యాప్తంగా దక్కాయి. ఇలా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలక్షన్లను వసూలు చేసి మంచి ఈ  మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ వీర సింహని విజయోత్సవం అనే పేరుతో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. 

సక్సెస్ ఈవెంట్ ను నిన్న అనగా జనవరి 22 వ తేదీన "జే ఆర్ సి" హైదరాబాద్ లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ కు ఈ మూవీలో కీలకపాత్రలో నటించిన హనీ రోజ్ కూడా విచ్చేసింది. హనీ ఈ సక్సెస్ ఈవెంట్ కు అదిరిపోయే లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఈ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో కెమెరాలు అన్నీ కూడా హనీ వైపే తిరిగాయి. అలాగే ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు కూడా అదిరిపోయే రేంజ్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ మీట్ లో హనీ  కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: