టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు మరోపక్క రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఓవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూ మరోవైపు రాజకీయాల్లో భాగంగా తన జనసేన పార్టీ తరఫున పాదయాత్రలు కూడా చేస్తూ ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గతేడాది భీమ్లా నాయక్ సినిమాతో పలకరించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే హరిహర వీరమల్లు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో  రానుంది.కాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తోంది.

 2020లో ప్రారంభమైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల లేట్ అవుతూ వస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాని 2023 లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా నిర్మాత ఎం ఎం రత్నం షూటింగ్ అంతా అనుకున్న విధంగా పూర్తయితే త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమా పిరియాడికల్ మూవీ అయినందున భారీ సెట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా ఎక్కువగా అవసరం అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ పవన్ అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ సినిమా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే ఈ సినిమా టీజర్ ని జనవరి 26న విడుదల చేస్తామని హరిహర వీరమల్లో సినిమా నిర్మాత ఎమ్ ఎమ్ రత్నం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాన్ని ఇప్పటివరకు మేకర్స్ అయితే అధికారికంగా ప్రకటించలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతోపాటు తమిళ మలయాళం కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: