దేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డ్ ప్యానల్ కు ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఎంపిక కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఇది తమకు వచ్చిన వ్యక్తిగత విజయంగా భావిస్తూ గర్వపడుతున్నారు. ‘లగాన్’ మూవీ తరువాత మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆస్కార్ అవార్డు ప్యానల్ కు నామినేట్ అయిన పాట ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలోనిది కావడంతో ఈవిజయాన్ని ‘ఆర్ ఆర్ ఆర్’ యూనిట్ ఆశ్వాదిస్తోంది.


‘నాటు నాటు’ పాటకు ట్యూన్ చేసింది కీరవాణి అయినప్పటికీ ఆపాటకు సంబంధించిన పదాలను కూర్చింది మటుకు ప్రముఖ గీతరచయిత చంద్రబోసు. తాను వ్రాసే పాటను ఒక తపస్సులా భావించే చంద్రబోస్ ఈపాట వ్రాసే సమయంలో చంద్రబోసు తాను పడ్డ 19 నెలల కష్టాన్ని వివరించాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఈపాటకు సంబంధించిన సన్నివేశాన్ని తనకు వివరించిన కీరవాణి తనకు ట్యూన్ ఇవ్వలేదని చెప్పాడు.


దీనితో తాను ఆలోచించి కీరవాణికి ఇష్టమైన ‘త్రిశ్ర గతి’ లో ఒక ట్యూన్ అనుకుని దానికి అనుగుణంగా ఈపాటను తాను వ్రాసిన విషయాన్ని బయటపెట్టాడు. వాస్తవానికి కీరవాణి చెప్పగానే తాను ఈపాటకు సంబంధించిన మూడు పల్లవులను కేవలం రెండు రోజులలోనే కీరవాణికి వ్రాసి ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అసలు సమస్య చరణాలు దగ్గర వచ్చింది అని అంటున్నాడు. ఈమూవీలో కీలకపాత్రలు అయిన రామ్ భీమ్ ల మీద ఈపాట చిత్రీకరించకవలసి ఉండటంతో ఒకరు ఆంధ్రా ప్రాంతం మరొకరు తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన వారు కావడంతో ఈరెండు ప్రాంతాలకు సంబంధించిన పదాలను కూర్చి పాటను పూర్తి చేయడానికి తనకు 19 నెలలు పట్టిన విషయాన్ని బయటపెట్టాడు.


కర్రసాము మిరపతోక్కు జొన్నరొట్టే ఇలా అవన్నీ అందరికీ తెలిసన పదాలే అయినప్పటికీ ఈపదాలను పాటగా మార్చే సందర్భంలో తనకు ఒకొక్కరోజు ఒకొక్క పదం మాత్రమే తన ఆలోచనలో వచ్చేదని ఈపాట కోసం ఒక తల్లి 9 నెలలు తన బిడ్డను మోసినట్లుగా తాను ఈపాటను మోసాను అని చంద్రబోసు భావోద్వేగంతో పాటకోసం తాను పడ్డ కష్టాలను గుర్తుకు చేసుకున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: