తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం తమిళ్ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకోవడం మాత్రమే కాకుండా వరుస వెబ్ సిరీస్ లలో అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈనటి కౌసల్య కృష్ణమూర్తి అనే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

మహిళా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లో ఈ నటి నటన కు మాత్రం తెలుగు సినీ ప్రేమికుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. దానితో ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు లభించాయి. అందులో భాగంగా కొంత కాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. 

మూవీ ద్వారా ఐశ్వర్య రాజేష్ మంచి నటిగా గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను అరబోయకుండా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే విధంగా సాంప్రదాయ బద్దంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఐశ్వర్య రాజేష్ బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: