ఈ మధ్య నందమూరి నటసింహం బాలకృష్ణ  వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు. పొరపాటున నోరు జారి బాలయ్య అనే కామెంట్స్ ఈ మధ్య కాలంలో వివాదాలకు ఎక్కువగా దారితీస్తున్నాయి. ఈమధ్యే వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో అక్కినేని తొక్కినేని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బాలయ్య.ఈ కామెంట్లపై అటు అక్కినేని హీరోలు కూడా స్పందించారు. ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు అని సోషల్ మీడియా ద్వారా అన్నారు. అంతకుముందు దేవాంగులకూ రావణబ్రహ్మకూ సంబంధముందంటూ.. కామెంట్స్ చేశారు బాలకృష్ణ. దీనిపై దేవబ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది.ఈ విషయం తెలిసిన బాలకృష్ణ వెంటనే రియాక్టయ్యారు. ఇది పొరబాటున దొర్లిన తప్పుగా చెప్పుకొస్తూ ఒక నోట్ ని రిలీజ్ చేశారు బాలకృష్ణ. దేవాంగుల్లో తనకు చాలా మంది అభిమానులుంటారనీ ఇక తన వారిని తానెందుకు బాధ పెట్టుకుంటానని పశ్చాతాపంతో కూడిన ప్రకటనని ఆయన చేశారు.అలాగే తన అన్ స్టాపబుల్ 2 టాక్ షోలో నర్సుల గురించి కూడా ఒక కామెంట్ చేశారు. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ లో నర్సు దాని.. యమా అందంగా ఉంది అంటూ బాలయ్య కామెంట్స్ చేశారు. దీని పై పలు సంఘాల వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. నర్సులను బాగా కించపరిచేలా బాల కృష్ణ వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.


తాజాగా ఈ వివాదం పై కూడా బాలకృష్ణ స్పందించారు.  సోషల్ మీడియాలో ఒక పోస్ట్  ని షేర్ చేశారు. ” అందరికి నా నమస్కారం, నర్సులను కించపరిచానంటూ కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను… నా మాటలను కావాలనే వక్రీకరించారు వారు. రోగులకు నిత్యం సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను నేను ప్రత్యక్షంగా చూశాను. ఇలా రాత్రింబవళ్లు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలిపే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా తక్కువే. కరోనా వేళ ప్రపంచ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతోమంది నర్సులు పగలనక, రాత్రనక నిద్రాహారాలు మానేసి కరోనా రోగులకు ఎన్నో సేవలందించారు. అటువంటి నర్సులను మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఇక నిజంగా నా మాటలు మీ మనోభావాలు దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ… మీ నందమూరి బాలకృష్ణ”అంటూ సారీ నోట్ ని రిలీజ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: