యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీ రోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఇప్పటికే చాలా కాలం అవుతున్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావడం ఆలస్యం అయ్యింది. కొన్ని రోజుల క్రితమే కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందినటువంటి అమిగోస్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ షూటింగ్ మార్చి 20 వ తేదీన కానీ అంతకంటే ముందు కానీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించాడు .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా , మోస్ట్ టాలెంటెడ్ సినిమాటో గ్రాఫర్ రత్నవేలు ఈ మూవీ కి కెమెరామెన్ గా వర్క్ చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే వార్త ప్రస్తుతం బయటకు వచ్చింది.

మూవీ ని ఐస్లాండ్ పోర్టు బ్యాక్ డ్రాప్ లో రూపొందబోతున్నట్లు , ఈ మూవీ లో అదిరిపోయే యాక్షన్స్ సన్నివేషాలు ఉండనున్నట్లు ఒక వార్త బయటకు వచ్చింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు పేరును ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను ఎన్టీఆర్ 30 అని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: